విన్నకోట నరసింహారావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

సరసభారతి ఉయ్యూరు పై వ్యాఖ్యలు;విన్నకోట నరసింహారావు

ఉయ్యూరు పంచదార ఫాక్టరి చరిత్ర ఆసక్తికరంగా ఉంది.

శ్రీ వెలగపూడి రామకృష్ణ గారిని టెక్నిషియన్ అన్నారేమిటి? వి.ఎల్.దత్తు, మారుతి రావు, రాజేశ్వరి గార్ల తండ్రిగారైన వెలగపూడి రామకృష్ణ గారే కదా? ఆయనయితే ఆయన ఒక ICS ఆఫీసరండి. జిల్లా కలెక్టరు, తదితర ఉన్నత పదవులు బ్రిటిష్ వారి పాలనాకాలంలో నిర్వహించిన వ్యక్తి. ఆయన ఆనాటి మద్రాసు ప్రభుత్వంలో Director of Industries గా పని చేస్తున్నప్పుడు KCP గ్రూపు (Krishna Commercial Products) మొదలెట్టారు. ఆ గ్రూపే ఉయ్యూరు పంచదార ఫాక్టరీని take over చేసింది.

Like


26 March 2024 12:18 PM

ఆలోచనాస్త్రాలు;విన్నకోట నరసింహారావు

వాళ్ళు తినరేమో అని ఎలా అనుకోగలం, Annin (10/12/2023 23:38) గారూ?
వాళ్ళేదో క్రికెట్ బాగా ఆడతారన్నంత మాత్రాన నిజ జీవితంలో వాళ్ళనేమీ ఉన్నతంగా ఊహించుకోనవసరం లేదని నా అభిప్రాయం. ఎవరి బలహీనతలు వారికుంటాయి. డబ్బులిస్తారంటే ఏ ఉత్పత్తికయినా మోడల్ గా చెయ్యడానికి రెడీ ఏమో అనిపించక మానదు ఈ so called సెలెబ్రిటీల తీరు చూస్తుంటే.


13 December 2023 1:33 PM

Comments for YVR's అం'తరంగం';విన్నకోట నరసింహారావు

🙂🙂 “రాజకీయ భేతాళ పంచవింశతిక” వ్రాసిన ముళ్ళపూడి వారి తరువాత మీరే 👏👍.

Like


13 September 2023 2:20 PM

Comments for YVR's అం'తరంగం';విన్నకోట నరసింహారావు

In reply to .

// “ ఆ తర్వాత మళ్ళీ నరసాపురం గురించి విన్నదీ, చదివిందీ ఏమీ లేదనే చెప్పాలి.” //
తన స్వంత గ్రామం నరసాపురం దగ్గరున్న మొగల్తూరు అని, నరసాపురం టెయిలర్ స్కూల్‌ లో తన చదువు అనీ వివరంగా తెలుగువారి అభిమాన బారిష్టరు పార్వతీశం గారు చెప్పినా కూడా మీరు నరసాపురం గురించి పై మాటంటారా? హెంత ఇదీ, హెంత అదీ !
(మీ ఈ పాత టపా ఇప్పుడే చూశాను. ఇంతకు ముందు ఎలా మిస్ అయ్యానా అని ఆశ్చర్యంగా ఉంది 🤔.)

Like


13 September 2023 1:32 PM

Comments for YVR's అం'తరంగం';విన్నకోట నరసింహారావు

ఎప్పటిలాగానే మీరు గీసిన పండగ చిత్రం బాగుంది 👏.
మీరు ఫొటోలు తియ్యడంలో కూడా సిద్ధహస్తులే కదా. ఈ మధ్య కాలంలో తీసిన “పొటిగరాపులు” ఏవైనా ఉంటే ఈ బ్లాగులో పోస్ట్ చెయ్యరాదూ?

Like


08 September 2023 5:11 PM

Comments for YVR's అం'తరంగం';విన్నకోట నరసింహారావు

చూసారా భారత్ అనే పేరు వినబడగానే మీరు ఎలా మేల్కొని మీ బ్లాగ్ ను తలుచుకున్నారో? అదండీ మరి ఆ పేరుకున్న శక్తి. 🙂.
సరే, కానున్నది కాక మానదు కానీ … ఏమై పోయారు ఇంతకాలం? అసలు సింగారం లోనే ఉన్నారా లేక వెళ్ళిపోయి చైనీయుడు అయిపోయారా 🙂? అమావాస్యకు పున్నమికి అయినా బ్లాగు లోకం లోకి తొంగి చూడకపోతే ఎలా మాస్టారూ? మీ పరిచయం ఉన్న మా బోంట్లు కంగారు పడతారు కదా.
ఎల్లరును సుఖులే కదా?

Liked by


07 September 2023 5:24 PM

కష్టేఫలే పై వ్యాఖ్యలు;విన్నకోట నరసింహారావు

అసలు సంగతిని సూక్ష్మంగా వివరించారు, బాగుంది 🙏.
ధృతరాష్ట్రుడి అలవిమాలిన పుత్రప్రేమే మహాభారతంలో జరిగిన అనేక అనర్థాలకు మూలం. గొప్ప ఏక్టర్ కూడా.


02 September 2022 10:14 AM

Comments for YVR's అం'తరంగం';విన్నకోట నరసింహారావు

నేను (కళ్ళజోడు సర్దుకుంటూ) :- ఎవరదీ అక్కడ?
మీరు :- నేనండీ YVR ని.
నేను :- అబ్బో, అబ్బో, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! బొత్తిగా అగుపడటం మానేశారే. ఇటువైపులకు రావడమే తగ్గించేసినట్లున్నారు. అంతా కుశలమేనా? చేతిలో ఏమిటది?
మీరు :- నేను గీసిన బొమ్మండీ.
నేను :- ఉహూఁ, అలాగా? బొమ్మ బాగానే వచ్చిందే. అవునదేమిటీ “మాలిక”లో వచ్చినట్లు లేదు?

(విన్నకోట నరసింహారావు)

Liked by


18 July 2022 9:02 PM

ఆలోచనాస్త్రాలు;విన్నకోట నరసింహారావు

“కన్యాశుల్కం” నాటకంలో రామప్ప పంతులు మధురవాణి తో “ఆ … గుంటడి వెకాస్యాలు నిజమనుకుంటావేమిటి?” అంటాడు చూశారా. ఈ సోకాల్డ్ సెలెబ్రిటీల మాటల విషయంలో కూడా అదే గుర్తు పెట్టుకోవడం ఉత్తమం.


13 October 2021 1:42 PM

ఆలోచనాస్త్రాలు;విన్నకోట నరసింహారావు

ఆశ్చర్యమేమీ లేదండి, “పద్మభూషణు”రాలు కదా. అయినా ఏదో ఓ బ్యాంకుకు ఎమ్.డి. గా పని చేసిన వ్యక్తికి కూడా “పద్మ” పురస్కారాలా?
అసలు ఏదో వ్యాపారంలోనో, ఆటల్లోనో, సినిమాల్లోనో రాణించినంత మాత్రాన ఈ అవార్డులకు అర్హతగా భావించడం కాకుండా సమాజశ్రేయస్సుకై చేసిన కృషిని పరిగణనలోకి తీసుకోవాలంటాను. అలాగే దేశరక్షణ కోసం పాటు పడిన వారికి కూడా అధికంగా ఈ గుర్తింపు దక్కాలి. అప్పుడే ఆ అవార్డులకు ఒక అర్థం పర్థం ఉంటుంది.


13 February 2021 4:48 PM

Journo Dreams;విన్నకోట నరసింహారావు

మహానుభావులు అటువంటి ఉపాధ్యాయులు 🙏.


23 November 2020 8:37 PM

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;విన్నకోట నరసింహారావు

“కృత్రిమ” పదం గురించి భాస్కర్ ఊలపల్లి గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను. కృత్రిమ, కృతక పదాలు నిఘంటువులో కనిపిస్తున్నాయి గానీ కృ తి మ అనే పదం నిఘంటువులో కనబడడం లేదు. ఆ పదం ఇప్పటికే వాడుకభాషలోకి వచ్చేసిందనీ అనిపించడం లేదు.


20 October 2020 9:14 AM

అనువాదలహరి;విన్నకోట నరసింహారావు

అనువాదం బాగుంది, మూర్తి గారూ. మీ ఈ బ్లాగ్ లింక్ రవిశంకర్ కు పంపించాను (రవిశంకర్ మా ఆఖరి తమ్ముడు).

రవిశంకర్ ఇతర రచనలు కొన్నిటిని కూడా మీరు ఇక్కడ ప్రచురించినట్లు మీ బ్లాగ్ చూస్తే తెలుస్తోంది.

సాహిత్య అకాడమి వారు “ప్రవాసీ మంచ్” అనే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ నెల 21న (21-06-2020) వారు అన్లైన్ లో జరిపిన తెలుగు కార్యక్రమంలో ప్రవాసులు రవిశంకర్ విన్నకోట, మానస చామర్తి, కిరణ్మయి యలమంచిలి (“నిషిగంధ”) తమ తమ కవితలు చదివారు. ఆ విడియోకు లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. ఇంతకు ముందే చూసుండక పోతే ఇప్పుడు చూడవచ్చు.

మెచ్చుకోండి


30 June 2020 11:06 AM

అనువాదలహరి;విన్నకోట నరసింహారావు

బాగుందండి, ఎంతైనా భర్తృహరి గారి సుభాషితం గదా.
అన్నట్లు, మితభాషికి “నిర్లక్ష్యం”తో బాటు అహంకారాన్ని కూడా అంటగడతారని నా పరిశీలన.

మెచ్చుకోండి


31 January 2020 6:53 PM

Telugu lo kaburlu చెప్పాలని ఉంది !;విన్నకోట నరసింహారావు

చాలా వివరణాత్మకమైన మీ వ్యాసం, దాని మీద “కష్టేఫలి” శర్మ గారి మరిన్ని వివరాలతో కూడిన వ్యాఖ్య …. ఆసక్తికరంగా ఉన్నాయి.

పైన “శ్రీ చౌడేశ్వరిమాత ఆవిర్భావ చరిత్ర…. ” అన్న పేరాలో “విన్నకోట సీమ” అన్నారు. దీన్ని గురించిన మరిన్ని వివరాలేమన్నా దొరుకుతాయా కాశ్యప్ గారూ? థాంక్స్.


10 December 2019 10:32 AM

కష్టేఫలి;విన్నకోట నరసింహారావు

‌కి స్పందనగా.

అంతేనంటారా? అంతేలెండి, “ఏమున్నదక్కో, ఏమున్నదక్కా” (ఏమున్నది + అక్కా) అని ఓ సినిమా పాట లో అంటాడు లెండి, అలాగన్నమాట 🙁 !

మెచ్చుకోండి


26 February 2018 8:29 AM

కష్టేఫలి;విన్నకోట నరసింహారావు

// “ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మవారి చలవండి 😦
ఇప్పుడు కనపట్టం లేదండి.” //
————————————-
విదేశీహస్తం అన్నమాట 👋.

మెచ్చుకోండి


26 February 2018 7:41 AM

కష్టేఫలి;విన్నకోట నరసింహారావు

మీ మాట వినిపించి చాలా రోజులైంది. అంతా సవ్యంగానే ఉంది కదా శర్మ గారు?

మెచ్చుకోండి


25 February 2018 5:57 AM

కష్టేఫలి;విన్నకోట నరసింహారావు

మీ మరొక బ్లాగ్ “కష్టేఫలే” “మాలిక” లో కనిపించదేమి, శర్మ గారూ ? ఇదివరలో కనిపించేదే 🤔!!

మెచ్చుకోండి


19 February 2018 7:37 PM

కష్టేఫలి;విన్నకోట నరసింహారావు

మారు వడ్డిస్తారా (బంగారపు రేకులు)?☺

మెచ్చుకోండి


19 February 2018 8:01 AM